
తొలి శుభోదయం కొండేపి:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,
ప్రజా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతను కాపాడడం మరియు అసాంఘిక కార్యకలాపాలను నివారించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కొండపి పట్టణ అవుట్‌స్కర్ట్స్ ప్రాంతంలో ఉన్న ఓపెన్ డ్రింకింగ్ ప్లేస్‌లను శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొండపి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బందితో కలిసి ఓపెన్ డ్రింకింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి, అక్కడ పేరుకుపోయిన చెత్త, ఖాళీ సీసాలు తదితరాలను తొలగించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
ఇలాంటి అనధికార మద్యం సేవనాన్ని అరికట్టేందుకు భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.