
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో రైతు సోదరులతో కలిసి స్థానిక చెరువును సందర్శించడం జరిగింది. నిండుకుండలా మారిన మన చెరువుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చాము.ఈ సందర్భంగా చెరువు అభివృద్ధి, ఆయకట్టు సాగునీటి సౌకర్యాలు, కాలువలు మరియు తూముల మరమ్మతులపై రైతులతో కూలంకషంగా చర్చించడం జరిగింది. సాగునీరు ప్రతి ఎకరాకు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాను.అలాగే గ్రామస్తులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ప్రతి సమస్యకు పరిష్కారం చూపి, కొండికందుకూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.