
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండేపి సీఐ శ్రీ సోమశేఖర్ గారు ఈ రోజు సర్కిల్ ఆఫీస్లో సర్కిల్ పరిధిలోని అన్ని సబ్ ఇన్స్పెక్టర్లతో క్రైమ్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, చట్టం మరియు శాంతిభద్రతల పరిరక్షణ, నిందితుల పర్యవేక్షణ, రౌడీ షీటర్ల కదలికలు, సస్పెక్ట్ షీటర్లపై నిఘా, అలాగే ప్రజల భద్రత కోసం చేపడుతున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.సీఐ మాట్లాడుతూ –“ప్రతి ఎస్ఐ తమ పరిధిలో నేరాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలతో మమేకమై పోలీస్ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలి. రాత్రి పహారాలు, పర్యవేక్షణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ నేరాలపై పట్టు సాధించాలి” అని సూచించారు.అలాగే రాబోయే పండుగలు, సమావేశాలు, ప్రజా కార్యక్రమాల సమయంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు సజావుగా కొనసాగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఐ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని అన్ని ఎస్ఐలు పాల్గొన్నారు.