
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
శింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో కోర్టుకు వచ్చే న్యాయవాదులు, వ్యాజ్యదారులు మరియు ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను గౌరవ న్యాయమూర్తి డా. వి. లీలా శ్యాంసుందరి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ,వేసవి కాలంలో కోర్టుకు విచారణల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఎండ వేడిని ఎదుర్కొంటారని, అటువంటి సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా వారికి తాగునీటి సౌకర్యం అందించడం ఎంతో మంచి సేవా కార్యక్రమమని అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను న్యాయవాదుల సంఘాలు ముందుకు వచ్చి నిర్వహించడం సమాజానికి ఆదర్శప్రాయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ, వేసవి కాలంలో కోర్టుకు వచ్చే ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ బక్కమంతల వెంకటేశ్వర్లు,
సీనియర్ న్యాయవాదులు కొల్లూరి వెంకట నరసింహారావు, రాయి రమేష్ , రాఘవేంద్ర,శ్రీనివాసులు, పంతగాని వెంకటేశ్వర్లు, రియాజ్,మహిళా న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
