
తొలి శుభోదయం ప్రకాశం:-
ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు రైళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు – రైలులో సుమారు 11.5 కిలోల గంజాయి మరియు 37 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులుగంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. పర్యవేక్షణలో ఒంగోలు రైల్వే స్టేషన్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఎస్సైలు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని, మాదకద్రవ్యాలను గుర్తించే జాగిలం రాక్సీతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కార్యాలయాలు తదితర ప్రదేశాలను సమగ్రంగా పరిశీలించారు.అదేవిధంగా, అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అలప్పుజా ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు నుంచి సింగరాయకొండ వరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 11.5 కిలోల గంజాయి మరియు 37 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 1. ఆషి, తండ్రి పేరు జబరుల్లా (25 సం)సత్యనాథపురం, నాగపట్నం జిల్లా, తమిళనాడు., 2.రంజిత్ బుడెక్( 24 సం) సునాబహల్, బలాంగీర్ జిల్లా, ఒడిశా. 3. బసుదేవ్ బోడక్ (26 సం) సునా దహల్, మల్కన్‌గిరి జిల్లా, ఒడిశా.