
తొలి శుభోదయం ప్రకారం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్. ఆదేశాల మేరకు, జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీసు శాఖ ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు ఒంగోలు పట్టణంలోని లారీ యూనియన్ కార్యాలయం వద్ద గంజాయి వినియోగం మరియు అక్రమ రవాణాపై లారీ యజమానులు, డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి సీఐ U. సుధాకర్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మహబూబ్ బాషా, ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ ముస్తఫా మరియు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బంది మాట్లాడుతూ ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులను గానీ, వారి లగేజీని గానీ లారీల్లోకి ఎక్కించుకోవద్దన్నారు. ఒకవేళ వారి వద్ద గంజాయి ఉంటే, తెలియక ఎక్కించుకున్నా సరే చట్టప్రకారం డ్రైవర్లు కూడా శిక్షార్హులవుతారు.
లారీ యజమానులు తమ వద్ద పనిచేసే డ్రైవర్ల పూర్వాపరాలను పరిశీలించి, నమ్మకస్తులైన వారిని మాత్రమే నియమించుకోవాలి. యజమానులకు తెలియకుండా డ్రైవర్లు గంజాయి రవాణాకు పాల్పడితే, సదరు వాహనాలను పోలీసులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. గంజాయి అమ్మడం, కలిగి ఉండటం లేదా సేవించడం నేరమని, దీనివల్ల డ్రైవర్ల కెరీర్ మరియు కుటుంబాలు నాశనమవుతాయన్నారు.
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులు టోల్ ఫ్రీ నంబర్: 1972 డయల్: 112 పోలీస్ వాట్సాప్ నంబర్: 9121102266. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయన్నారుఈ కార్యక్రమంలో లారీ యూనియన్ తరపున ప్రెసిడెంట్ కల్లూరి అంజిబాబు, సెక్రెటరీ కొమ్మూరి ప్రసాద్, ట్రెజరర్ వేమూరి శ్రీనివాసులు, నాడారి నాగరాజు మరియు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, కార్మికులు హాజరయ్యారు.