
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
లింగసముద్రం మండలం, చినపవని పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రూ. 26 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించాను. గడిచిన 22 నెలల్లోనే ఈ గ్రామంలో సుమారు రూ. 50 లక్షలకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అనంతరం, స్వర్గీయ దామా విజయ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు (రమేష్, బాలకృష్ణ, హరికృష్ణ) రూ. 6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించాను. దాతల సేవా దృక్పథం అభినందనీయం. వచ్చే మూడేళ్లలో పంచాయతీలో మరింత భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నాను.