
తొలి శుభోదయం:-
గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జె. రామకోటయ్య కొమరోలు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లో జరుగుతున్న పరిపాలన పనితీరును, రికార్డుల నిర్వహణను, యూ.ఐ (Undetected/Under Investigation) కేసుల ప్రగతిని సమీక్షించారు.సీసీటీఎన్ఎస్ (CCTNS) అప్డేషన్ పెండింగ్ అంశాలను పరిశీలించి, తక్షణంగా అప్డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే యూ.ఐ కేసులను త్వరితగతిన పరిష్కరించి, కేసు దర్యాప్తుల్లో నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు.ఇక స్టేషన్ రికార్డులు, ఫిర్యాదుల రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, బీట్ బుక్స్, క్రైమ్ మ్యాపింగ్ మొదలైన వాటిని జాగ్రత్తగా తనిఖీ చేసి, అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు.ప్రజా భద్రత, న్యాయవ్యవస్థ పట్ల నిబద్ధతతో, పోలీసులు మరింత సమర్థంగా సేవలందించాలని సిఐ గారు సిబ్బందిని ప్రోత్సహించారు.