
రాస్తారోకో లో పాల్గొన్న బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
తొలి శుబోదయం న్యూస్ :- వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు కడారి సురేష్ యాదవ్, దుగ్గొండి మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై నిర్వహించిన రాస్తారోకో ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు, నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు బీసీ జేఏసీ చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ దుగ్గొండి మండలంలోని బీసీ సంఘాల నాయకులు మరియు బీసీ కుల సంఘాలతో బీసీ సంఘాల నాయకులు మరియు బీసీ కుల సంఘాలతో వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారి పై దాదాపు గంటపాటు జరిగిన ధర్నా రాస్తారోకో లో బీసీ నినాదాలతో ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు కిక్కిరిసి నిలిచిపోయాయని అన్నారు. బీసీల రిజర్వేషన్లను అగ్రవర్ణ కులాలకు చెందిన దుర్మార్గులు హైకోర్టు లో పిటిషన్ వేసి బీసీలకు రావలసిన 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకున్నారని హైకోర్టులో స్టే వచ్చే విధంగా చేసిన అగ్రవర్ణాల కుట్రలను తెలంగాణ బీసీ సమాజం తిప్పి కొట్టే విధంగా రాస్తారోకో ధర్నాలతో మన రిజర్వేషన్ లను సాధించుకునే వరకు పోరాటాలు చేయాలని అన్నారు. ఇప్పటికైనా బీసీ కులాలకు చెందిన వారు ఏకమై రేపు అనగా ఈనెల 18న బిసి జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ బంద్ ను విజయవంతం చేయడంలో వరంగల్ జిల్లాతో పాటు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి కానుగుల కుమారస్వామి, జిల్లా నాయకులు కోరే రాజేష్ కురుమ, డ్యాగం శివాజీ, మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్, మండల కార్యదర్శి మొకిడే శ్రీకాంత్, మండల యూత్ అధ్యక్షులు బండారి ఉదయ్ కిరణ్, మహ్మదాపురం గ్రామ అధ్యక్షుడు నన్నరాజు, మండల నాయకులు బండారి ప్రకాష్, ముత్యాల స్వామి, ముదిరాజ్ బండారి రమేష్, కోండ్రోజు చంద్రమౌళి, మెరుగు కట్టమల్లు, పాలడుగుల రాజేందర్, గుండెకారి నర్సింగరావు, భువనగిరి కమలాకర్, ఇజ్జగిరి నరేష్, లకిడే రాజు, బూర్గుల రాజబాబు, ఎలిసోజు శ్రీనివాసాచారి, ఇజ్జగిరి నాగరాజు, నల్ల రవీందర్ గంగుల రవీందర్ మెరుగు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
