
తొలి శుభోదయం న్యూస్ :-
గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన భీమని వందనాదేవి కి అభినందనలు. అరండల్పేట జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని, జిల్లాలో గ్రంథాలయాల బలోపేతం, ఆధునీకరణకు ప్రాధాన్యతనిస్తూ జ్ఞాన వాతావరణాన్ని గ్రామస్థాయికి విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించాను. మేధావులు, గ్రంథాలయ సిబ్బంది, ప్రజల భాగస్వామ్యంతో గ్రంథాలయాలను యువతకు మార్గదర్శక కేంద్రాలుగా తీర్చిదిద్దడం మన లక్ష్యం. పార్టీ కోసం సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశంలో గౌరవం, బాధ్యతలు లభిస్తాయని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ప్రజాసేవే ధ్యేయంగా జిల్లా గ్రంథాలయ వ్యవస్థను ఆదర్శంగా నిలబెడతారని నమ్మకం వ్యక్తం చేస్తూ వందనాదేవి కి శుభాకాంక్షలు.