
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్చి నెల 1 తేదీన నిర్వహించిన డాక్టర్ BR అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎంట్రన్స్ పరీక్షలో మార్కాపురం జిల్లా, తర్లుపాడు మండలం, లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి నలుగురు బాలురు, ముగ్గురు బాలికలు మొత్తం 7 మంది పరీక్ష వ్రాసిన 7 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించారు.5 వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉచితం గా గురుకుల పాఠశాల లో చదువుకోవచ్చని, తల్లితండ్రులకు భారం లేకుండా ఉన్నత చదువులు చదువుకొని అభివృద్ధిలోకి రావాలని HM షేక్ మౌలాలి సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని గ్రామంలో తల్లితండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అలివేలు కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.