
ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి
గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ
తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:-
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధుల ద్వారా అందించిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర రిక్షాలు, చెత్త సేకరణ డబ్బాలు టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం మంత్రి ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి వివిధ గ్రామాల పంచాయతీ సిబ్బందికి రిక్షాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో నూరు శాతం చెత్త సేకరణ జరగాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.
పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి. చెత్తపై పన్ను వేసి జగన్ ప్రజలను వేధిస్తే సీఎం చంద్రబాబు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి 20 నెలల పాలలలోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సందర్భంగా క్లాప్ మిత్రాలకు జీతాలను సకాలంలో అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.
