
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని ఆదిఆంధ్రకాలనీకి చెందిన పర్సు సురేష్… ఇటీవల జరిగిన గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తమ ఫలితం సాధించి సబ్ రిజిస్టర్ గా ఎంపికయ్యారు. గతంలో రెవిన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ… కష్టపడి ఉద్యోగం సాధించారు. ఈ నేపథ్యంలో… శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ని సురేష్ మర్యాదపూర్వకంగా కలవగా, అతనిని ఎమ్మెల్యే సత్కరించి అభినందించారు.
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నాయకులు పర్సు నాగేశ్వరరావు, చదలవాడ కోటేశ్వరరావు, ఐజాక్, రామయ్య తదితరులు సురేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.