
తొలి శుభోదయం :-
పోలీసు అమర వీరుల సంస్మరణ దినం - 2025 ఘనంగా జరిగింది. మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో మంగళవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం - 2025 జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభా స్థలికి హాజరైన ముఖ్యమంత్రికి పోలీసు దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి "అమరవీరులు వారు" అనే అమర వీరుల పుస్తకావిష్కరణను చేశారు. అమర వీరుల స్మారక స్థూపం వద్ద అమరులైన పోలీసు అమర వీరులకు పుష్పగుచ్ఛాలు పెట్టి ఘనంగా నివాళులు అర్పించారు. అమర వీరుల ఫోటో గ్యాలరీ ను ముఖ్యమంత్రి, అతిథులు సందర్శించారు.అమర వీరుల పేర్లను పోలీసు అధికారి సరిత చదివి వినిపించారు.డి.జి.పి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ధైర్యంతో, సెల్ఫ్ లెస్ సర్వీస్ తో పోలీసులు చేస్తున్నారన్నారు. సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయడం జరుగుతోందన్నారు. సైబర్ క్రైమ్ వంటి అనేక క్లిష్ట పరిస్థితులను సైతం ధైర్యంగా, స్థైర్యంగా ఎదుర్కోవడం
జరుగుతోందని చెప్పారు. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటూ, సమాజ క్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కడపకు చెందిన 11వ బెటాలియన్ సహాయ కమాండెంట్ పి.రాజశేఖర్ పెరేడ్ దళాలకు నాయకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్, ఉన్నత అధికారులు, ఇతర అధికారులు, అమర జవాన్ల కుటుంబాల సభ్యులు, పోలీసు కుటుంబాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.