
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం, మండలపరిషత్ ప్రాధమిక పాఠశాల,గవదగట్లవారిపాలెం లో బాలల దినోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు అధ్యక్షత వహించారు.ఈ సందర్భం గా విద్యార్థులు పాటలు, నృత్యాలు, క్విజ్, డ్రాయింగ్, గేమ్స్ వంటి అనేక పోటీల్లో చురుకుగా పాల్గొన్నారు. విజేతలకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక బహుమతులు అందజేశారు అనంతరం పిల్లలకు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి విద్యతో పాటు నైతిక విలువలు కూడా ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
“పిల్లలు దేశ భవిష్యత్తు. మీరు ఎలాంటి మార్గంలో నడుస్తారో, రేపటి సమాజం కూడా అదే దారిలో నడుస్తుంది. విద్య అంటే కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు; క్రమశిక్షణ, నైతికత, పరస్పర గౌరవం కూడా అంతే ముఖ్యమైనవి. మీరు చిన్నప్పుడే మంచి అలవాట్లు అలవరచుకుంటే, పెద్దయ్యాక ఏ విఘ్నం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు.మీరు మీ లక్ష్యాలను పెద్దగా పెట్టుకోండి. చిన్న ప్రయత్నం కూడా మీ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక పెద్ద అడుగు అవుతుంది. గురువుల మాట వినండి, తల్లిదండ్రులను గౌరవించండి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సంకల్పించండి” అని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.