
తొలి శుభోదయం న్యూస్ - గిద్దలూరు:-
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడిగా ఉన్న చక్రపాణి యాదవ్ రాష్ట్రస్థాయి పదవి వరించిన సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ గిద్దలూరు డిపో నేతలు అభినందించారు. ఒంగోలులో జరిగిన 18వ ఎంప్లాయిస్ యూనియన్ లో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని శుక్రవారం పలువురు నేతలు చక్రపాణి యాదవ్ ను అభినందించారు. ఆర్టీసీ యూనియన్ లో డిపో అధ్యక్షుడిగా 12 సంవత్సరాలు నెల్లూరు జోనల్ జాయింట్ సెక్రెటరీగా ఉపాధ్యక్షులుగా 10 సంవత్సరాలు ఎంప్లాయిస్ యూనియన్ లో కీలకంగా పని చేశారు. దశబ్దకాలంగా ఆర్టీసీ కార్మికుల కోసం నిరంతరం పనిచేస్తూ మంచి నేతగా గుర్తింపు పొందారు. ఎంప్లాయిస్ యూనియన్ ద్వారా మంచి పేరును మంచి నాయకుడిగా ఆర్టీసీ కార్మికుల కోసం పనిచేశారు. ఈ సందర్భంగా చక్రపాణి యాదవ్ మాట్లాడుతూ ఎంప్లాయిస్ యూనియన్ తనను ఎంతో ఆదరించిందని కార్మికులు తన పట్ల చూపిన అభిమానం వల్లే రాష్ట్రస్థాయికి చేరుకున్నానన్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం నిరంతరం పనిచేస్తానని రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలు చేసి కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పలువురు చక్రపాణి యాదవులు అభినందించారు.