
ప్రయివేటు విద్యాసంస్థలకు ధీటుగా ఫలితం సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
పేదల విద్యాభివృద్ధి సంక్షేమం కోసం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన ఉపాధ్యాయుల ద్వారా అందిస్తున్న చదువులకు ప్రకాశం జిల్లా సింగరాయకొండ అయితా రామయ్య శెట్టి గడ్డం వీర రాఘవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి గుర్తు తెచ్చాడు. మట్టిలో మాణిక్యాలు అంటే ఇలాంటి ఎటువంటి ఆసరాలక రెక్కాడితే గాని డొక్కాడని, వలస కూలీల కుటుంబంలో నుండి చదువుల్లో రాణించి తన స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం తో ఈ వర్గాల అభ్యున్నతి విద్యాభివృద్ధి ఆశించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ ఆశయం ఫలించినట్లయింది. సంపద ఆస్తి పాస్తులు సమాజం అండ, నిలువ నీడ తగినంత సంపాదన లేక పోయినా తల్లి దండ్రులు వలస కూలీల గా జీవనం గడుపుతున్న తన నాయనమ్మ సంరక్షణలో ప్రభుత్వ పాఠశాల, అక్కడి ఉపాధ్యాయుల సహకారంతో ఇంటర్ ఫలితాల లో 975 మార్కులు సాధించిన 'కత్తి ' కిరణ్ అని చెప్పక తప్పదు.ఇల్లు గడవదు ఇట్లు వృద్ధురాలు నాయనమ్మ సంరక్షణ, అక్క తో కలిసి ఇంటి పనులు వంట పనులు చక్క బెట్టుకుని కాలేజీ చదువు కోసం కిలోమీటర్ పైగా కాలి నడకన వెళ్ళి తన లక్ష్య సాధనలో నిజయం సాధించిన పాత సింగరాయకొండ నరసింహ నగర్ కి చెందిన కత్తి సుబ్బులమ్మ మనుమడు కత్తి కిరణ్ ప్రభుత్వ ప్రోత్సాహం తో స్వయం లక్ష్య సాధన దిశగా ఉన్నత చదులు చదివి అందరికీ ఆదర్శంగా నిలవాలని వలస కార్మికులైన తల్లిదండ్రులకు ఉన్నత జీవితం ఇవ్వాలని ప్రజలు, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు, తన సోదరి నాయనమ్మ ఆశీస్సులు అందించారు. తల్లి దండ్రులు వలస కూలీలు గా పొట్టకూటి కోసం వెళ్ళినా క్రమ శిక్షణ, చదువే సంపద, చదువే ఆస్తి అన్న లక్ష్య సాధనని విస్మరించకుండా నిందించడం కాదు సాధించాలి అన్న పట్టుదలతో ఇంటర్ ఫలితాల లో తన ప్రతిభను చాటి గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. తమ కళాశాల లో ఇంటర్ చదువుకున్న కత్తి కిరణ్ చదువు తప్ప ఇంక ఏది ప్రధానం కాదు అన్న లక్ష్యంతో చదువు కొనసాగించడమే అతని ఉన్నతికి సోపానం అని కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సౌజన్య అభినందించి ఆశీస్సులు అందించారు. ఇంటర్ మొదటి సంవత్సరం లో 460, రెండవ సంవత్సరం లో 540 మార్కులు సాధించి రెండు సంవత్సరాల లో 975 మార్కులు సాధించడం సాధారణ విషయం కాదని ఉపాధ్యాయులు అభినందించారు. ప్రభుత్వం ఇలాంటి పేద మేధావులను దత్తత తీసుకుని ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తే దేశాభివృద్ధి సమాజాభివృద్ధి లో తమ వంతు బాధ్యతలు పంచుకుని పేద వర్గాలలో ఆత్మ స్థైర్యం, విశ్వాసాన్ని కలిగించే అవకాశం ఉంది.
