
తొలి శుభోదయం సింగరాయకొండ:-
జనవరి నెల 24వ తేదీ శనివారం ఒంగోలులో ఎన్టీఆర్ కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని చిరంజీవి కే.సౌమ్య జిల్లా స్థాయిలో మొదటి బహుమతిని సాధించారు. ఎన్టీఆర్ కళాపరిషత్తు వారు మంగళవారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆ విద్యార్థినికి మాజీ మంత్రివర్యులు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు చేతుల మీదుగా పదివేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. బుధవారం నాడు పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని కే.మహాలక్ష్మి విద్యార్థినిని అభినందించారు. అలాగే విద్యార్థినికి శిక్షణ ఇచ్చిన చిత్రలేఖన ఉపాధ్యాయుడు జె.వి.సుబ్బారావు ని కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోధన మరియు బోధనేతర సిబ్బంది అభినందించడం జరిగింది.