
ప్రతి ఒక్క బుల్లెట్ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేదించే నైపుణ్యం పొందాలి
అత్యవసర పరిస్థితుల్లో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల మరియు ప్రాణాల రక్షణకై ఎల్లవేళలా పూర్తి స్థాయిలో సంసిద్ధులై ఉండాలి.
తొలి శుభోదయం ప్రకాశం:-
పోలీసులు తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పూర్తి స్థాయి పరిజ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా చీమకుర్తి నందు గల జిల్లా ఫైరింగ్ రేంజ్ లో పోలీసు అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్ ను ఆదివారం జిల్లా ఎస్పీ సందర్శించి అక్కడ జరుగుతున్న ఫైరింగ్ ప్రక్రియను పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.ఫైరింగ్ సాధన ప్రక్రియలో జిల్లా ఎస్పీ పాల్గొని, ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అధికారుల్లో ఉత్సాహం, మనోధైర్యాన్ని నింపారు. ఈ ఫైరింగ్‌లో ప్రతి అధికారి తప్పనిసరిగా పాల్గొని మంచి మెళకువలు నేర్చుకోవాలని, ఫైరింగ్‌కు సంబంధించి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఫైరింగ్ రేంజ్లో క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యత వహిస్తుందని, ఫైరింగ్ రేంజ్ అధికారుల సూచనల మేరకు అత్యంత జాగ్రత్తగా, ఏకాగ్రతతో ఫైరింగ్ చేయాలన్నారు. ప్రతి ఒక్క బుల్లెట్ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేదించే నైపుణ్యం పొందాలని సూచించారు.కొత్తగా వచ్చిన ఆయుధాలపై పూర్తి స్థాయి తర్పీదు పొందుతూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల, ధన మరియు ప్రాణాల రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అత్యంత కీలకమని, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి జిల్లా పోలీసు శాఖ ఉన్నతి సాధనలో ఎల్లప్పుడూ ముందడుగు వేయాలని సూచించారు.
ఫైరింగ్ లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను అభినందించి, రివార్డ్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ లక్ష్మి నారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి. వి.రమణ కుమార్, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, డిటిసి డిఎస్పీ జి.గురునాథబాబు, ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
