
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం& మార్కాపురం పోలీస్:-
ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చెడు నడత గల వ్యక్తులు (Rowdy Sheeters)పై ప్రత్యేక దృష్టి సారించారు. సమాజంలో నేరాలను తగ్గించి, ప్రజలకు భద్రత కల్పించేందుకు భాగంగా వారికి కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు రోడీ షీటర్లకు కఠినంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఎటువంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. చట్టాలను గౌరవిస్తూ, సమాజంలో బాధ్యతాయుతంగా జీవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అలాగే, కుటుంబ సభ్యులతో కలిసి సక్రమమైన జీవనం గడపడం, సమాజానికి ఉపయోగపడే విధంగా మారడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల సహకారం లేకుండా శాంతి భద్రతలను పరిరక్షించడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొన్నారు. అందువల్ల, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి, భద్రమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
సురక్షిత సమాజం కోసం పోలీసుల చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.