
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు సమీపంలోని చెర్లోపాలెం వద్ద శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి, రోడ్డు మార్జిన్ లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరుకు చెందిన దంపతులు, పిసిపల్లి మండలం పెదఇర్లపాడు గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి, తిరిగి నెల్లూరు వెళుతున్నారు. చెర్లోపాలెం సమీపంలో కారు అదుపుతప్పి, రోడ్డు పక్కనున్న వెంకట్ ఫుడ్ కోర్ట్ సమీపంలోకి దూసుకెళ్లింది. దంపతులిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు , ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. దంపతులను పరామర్శించి యోగక్షేమాలు కనుక్కున్నారు. అనంతరం వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి పంపించారు.