
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :-
ఉలవపాడు మండలం లోని భీమవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి సుబ్బారావు మరియు సైన్స్ ఉపాధ్యాయులు మేడికొండ భాస్కర్ దార్ల అంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ లో అందరూ విద్యార్థులు పాల్గొని సుమారు 40కి పైగా అంశాలలో ప్రాజెక్టులను ఉంచారు. ఈ సందర్భంగా ఎంపికైన ప్రాజెక్టులకు బహుమతులను అందజేశారు విద్యార్థులు ప్రదర్శించిన అంశా లలో శరణ్య చందన భారతి జాన్ వేణు శ్రావ్య నిత్య విశ్వనాథ్ రజిత మొదలైన విద్యార్థులు బహుమతులను అందుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ప్రతి విద్యార్థి ప్రాజెక్టును ప్రదర్శించడం సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడం అభినందించదగ్గ విషయం ఈ అంశాలను ప్రదర్శించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెండు సుబ్బారావు గారు అభినందించి భవిష్యత్తులో భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా మీరు ఎదగాలని విద్యార్థులకు ఉద్బోధించారు అనంతరం విద్యార్థులు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి.సహకరించిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు సైన్సు ఉపాధ్యాయులు మేడికొండ భాస్కర్ దార్ల అంకయ్యలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివరాం శ్రీధర్ మస్తాన్వలి చిట్టిబాబు హేమలత సుబ్బారావు మరియు సిబ్బంది హనుమంతరావు బుజ్జీలు పాల్గొన్నారు విద్యార్థులకు మిఠాయిలు పంచడంతో కార్యక్రమం ముగిసింది.