
తొలి శుభోదయం సింగరాయకొండ:-
జతన్ దానియేల్ జల్ది మొదటి పుట్టినరోజు సందర్భంగా అమెరికాలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులు, మరియు తాతయ్య ఆశీస్సులతో గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా
సోమరాజు పల్లి పంచాయతీ పరిధిలో టి పి నగర్ మరియు అప్పాపురం కాలనీలకు చెందిన గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషక విలువలు కలిగిన పండ్లు,ఆర్గానిక్ బెల్లం, ఖర్జూరం, వేరుశనగ ముద్దలు, రాగి పిండి,ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గర్భధారణ సమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోవడం తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువు శారీరక, మానసిక అభివృద్ధికి అత్యంత అవసరమని తెలిపారు.సమాజంలో పలువురు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై తమ పుట్టినరోజులు, శుభకార్యాలను సేవా కార్యక్రమాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.అంగన్వాడి సూపర్వైజర్ షేక్ సైదాబి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం వారి ఆరోగ్యంపైనే కాకుండా శిశువు భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లో ఆరోగ్య అవగాహన పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గర్భం దాల్చిన దగ్గర నుండి బిడ్డ పెట్టబోయే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీ స్త్రీలు, అంగన్వాడి టీచర్లు అర్రిబోయిన వెంకట సుజాత, శైలజ మరియు చిన్నారులు పాల్గొని కార్యక్రమ నిర్వాహకులకు, ఫ్రెండ్స్ ఆర్గనైజషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు..
