
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఇటీవల మరణించిన కూరపాటి నాగమణి కుమారుడు వంశీ కుటుంబానికి జనసేన పార్టీ వైపు నుంచి ఆర్థిక సహాయం అందింది. ఆదివారం ఆర్థిక సహాయం రూపంలో చెక్కును జనసేన పార్టీ నాయకులు కొణిదెల నాగబాబు స్వయంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమం క్రియాశీల వాలంటరీ కాసుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగింది. వంశీ కుటుంబం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను గుర్తించిన జనసేన పార్టీ నాయకులు, వారి భవిష్యత్తు అవసరాలకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని ముందుకు తెచ్చినట్లు తెలిపారు.