
తొలి శుభోదయం న్యూస్ కంభం :-
జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యకార్యక్రమంలో భాగంగా మంగళవారం కంభం టీబీ యూనిట్ ఆధ్వర్యంలో కంభం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి కందులాపురం సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్య కార్యక్రమంలో డాక్టర్ రమేష్ మరియు డాక్టర్ కావ్య మరియు సూపరెండెంట్ డాక్టర్ శిరీష (చిన్న పిల్లల స్పెషలిస్ట్), టీబీ యూనిట్ సూపర్ వైజర్ కె. శ్రీనివాస్ రెడ్డి, యం ఎల్ హెచ్ పి లు, ఏయన్ఎం లు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మాట్లాడుతూ జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన సందర్భంగా ప్రజలకు టీబీ వ్యాధి గురించి వ్యాధి లక్షణాల గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రెండు వారాలపాటు జ్వరం, పొడి దగ్గు, దగ్గులో కఫం పడటం, బరువు తగ్గటం, రాత్రి పూట ఎక్కువగా చమటలు పట్టడం లాంటి లక్షణాలు ఉన్న వారు ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలలోని టీబీ యూనిట్ కు వచ్చి రక్త పరీక్షలు, ఎక్స్ రే పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలి అని తెలియజేశారు. ఇంకా టీబీ అంటే నెమ్ము అని అర్థం. ఇది మనిషిలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే అటాక్ చేస్తుందని కావున ఎవరూ భయపడనవసరం లేదని తెలిపారు. మంచి బలమైన ఆహారంతో టీబీ జబ్బును తరిమేయవచ్చని తెలిపారు.