
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
కొండపి నియోజకవర్గం,
సింగరాయకొండ మండలం,
శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ అధికారి డిప్యూటీ ఎంపీడీవో శారద ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్మికులకు సన్మానం చేసి సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు కాసుల శ్రీకాంత్ గారు, సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, జన సైనికులు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏ ఎన్ యం లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొనడం జరిగినది.