
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి-4 పథకం ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.కేపీఐ (KPI) లక్ష్యాల సాధన మరియు 'జీరో పావర్టీ' (P-4) అమలుపై జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 'బంగారు కుటుంబాల'కు అండగా నిలవాలని ఆదేశించారు.