
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ గ్రామపంచాయతీలో ఉదయం నుంచి సాయంకాలం వరకు 179 అసెస్మెంట్లు, 2,75,000 రూపాయలుమాత్రమే వసూలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామపంచాయతీకి సంబంధించిన మొత్తం డిమాండ్ రూ. 239.2లక్షలు కాగా, ఇప్పటివరకు రూ.87.89 లక్షలు మాత్రమే వసూలు చేయబడింది. అనగా 36.74% శాతం మాత్రమే వసూలు చేయబడింది మిగిలిన రూ.63.26/-లక్షలు మార్చి 15 వ తేది లోపు కలెక్షన్ చెయ్యవలసిందిగా ఆదేశించారు. కమిషనర్ పంచాయతీ రాజ్ మరియు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మార్చి 15 నాటికి ఇంటి పన్నులు మరియు పన్నెతరములు 100 శాతం వసూలు కావాలి
పెండింగ్ బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలు 4 (Special Teams) ఏర్పాటు చేసిన వారితో ఫీల్డ్ విజిట్ చెయ్యడమైనది తక్షణ చర్యలు తీసుకొని 100% వసూళ్లు పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.ఇంటి పన్ను వసూళ్లలో ఎటువంటి నిర్లక్ష్యం, ఆలస్యం లేదా నిర్లిప్తత సహించబడదని, బాధ్యులపై చట్టపరమైన మరియు శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు. కాబట్టి సంబంధిత సిబ్బంది అందరూ దీనిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, రోజువారీ ప్రణాళికతో వసూళ్లు వేగవంతం చేసి, వెంటనే వసూలు చేయవలసిందిగా ఆదేశించినారు, స్వయంగా ఇంటి పన్ను కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించి ఇంటి పన్ను వసూలు చేయించినారు.ఈ కార్యక్రమంలో శ్రీయుత. MPDO L.జయమని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, మరియు. హౌస్ టాక్స్ కలెక్షన్ టీమ్ మెంబర్స్ పాల్గున్నారు.
