
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..
నాణ్యమైన ఆహారాన్ని అందించాలి! రాష్ట్ర ఫుడ్ కమీ షన్ సభ్యులు బి. కాంతారావు
తొలి శుభోదయం కందుకూరు:-
విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన , రుచికరమైన, శుచి కరమైన ఆహారాన్ని మెనూ ప్రకారంఅందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. జిల్లాలోని కందుకూరుపట్టణం, కందుకూరు మండలం, గుడ్లూరు మండలంలలో మాచవరం,గుడ్లూరు, కందుకూరు బాలుర బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఆహారం నాణ్యత లోపిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులతో మాట్లాడుతూ కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించితల్లిదండ్రులకు గౌరవం తేవాలని అన్నారు. ఎంతోమంది ఉన్నత ఉద్యోగాలలో ఉన్న వారు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ఉండిప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత పదవులు అధిరోహించారని ఆయన తెలిపారు. రేషన్ షాపులు, అంగన్వాడి కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ ,బీసీ వసతి గృహాలు, కేజీబీఎస్, గురుకుల వసతి గృహాలను తనిఖీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన పలుచోట్ల విద్యార్థిని, విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా అని వారిని అడిగితెలుసుకున్నారు. విద్యార్థులకు మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు. అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలో మెనూ ప్రకారం ఆహారాన్ని విద్యార్థులకు అందించకపోతే కఠిన చర్యలను తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ, ఇన్చార్జి డిఎస్ఓ లీలారాణి,సివిల్ సప్లై డిఎం అర్జున్ రావు,డిప్యూటీ డీఈవో నరసింహారావు, ఫుడ్ సేఫ్టీ డివిజన్ అధికారాణీ ప్రణతి,సోషల్ వెల్ఫేర్ శోభారాణి,ట్రైబల్ వెల్ఫేర్ సుజాత,హెచ్ ఎం లు ద్వారకా రాణి, నరసింహమూర్తి, ఎంఈఓ 1 శర్మ, ఎంఈఓ2 సుబ్బారెడ్డి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులుచిత్తరు వెంకటేశ్వర్లు, పెరుగు ప్రసాదు,మాల్యారావు,పిడి బాలసుబ్రమణ్యం, మంగతాయారు, సీఆర్పీలు రమణారెడ్డి, ప్రతిభ,తదితరులు పాల్గొన్నారు.