
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలలో భాగంగా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రపురం గ్రామ పొలాల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో అక్రమంగా జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకుని, వారి వద్ద నుంచి మొత్తం ₹93,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతలను భంగం కలిగించే అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇటువంటి చర్యలపై నిరంతరం దాడులు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.