
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
సోమవారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఆరిమండ. మధుసూదన్ రెడ్డి,వెంకట రమణ ల కుమారుడు ఆరిమండ.జస్వంత్ రెడ్డి జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ నందు 99.48 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభను కనపరిచాడు. విద్యార్థి ఆరిమండ జస్వంత్ రెడ్డి విజయవాడ నగరంలోని కృష్ణారెడ్డి చైతన్య కళాశాల నందు చదువుతున్నాడు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితం అందుకున్న విద్యార్థి జస్వంత్ రెడ్డిని కళాశాల డైరక్టర్ ఇబ్రహీం, మరియు కళాశాల యాజమాన్యం అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.