
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కోవూరు నియోజకవర్గం ప్రగతి పధంలో పయనిస్తుంది.మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో 1 కోటి 11 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్హి కుంటు పడింది నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన గత 20 నెలలో జొన్నవాడ గ్రామంలో 90 లక్షలతో డ్రైనేజీలు, 10 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించగా.. ఇందులో VPR ఇన్ఫ్రా 20 లక్షలు CSR నిధుల నుండి అందజేయడం జరిగింది.జొన్నవాడ గ్రామంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న 8 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 11 లక్షల 20 వేలు ఆర్ధిక సహాయం అందచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవత్వం చాటుకున్నారు. రానున్న వేసవిలో తాగునీటి కొరత రాకుండా RWS అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వచ్చే ఏప్రియల్ నాటికి పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తాం అని తెలియజేస్తున్నాను.