
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
దళితులపై దాడులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టబద్ధంగా న్యాయపోరాటం చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తామని హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. టంగుటూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా మాలల జేఏసీ నాయకులు జడ శ్రవణ్ కుమార్ను కలిసి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ దళితులపై దాడులు చేయడం అంగీకరించలేమని, చట్టపరంగా పోరాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అశోక్ బాబు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తే, అలాగే దళితులపై దాడులు జరిగితే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా దళితులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాలల జేఏసీ ఉపాధ్యక్షుడు పులవర కృష్ణయ్య, టి. క్రాంతి కుమార్, వెయ్యల సురేష్, రామకోటయ్య, వెంకన్న, కందుకూరు నుండి DCH మాల కొండయ్య, సింగయ్య. మార్కాపురం జిల్లా గౌరవ అధ్యక్షుడు శాంతరాజు, బధూర్ల, టి. శ్రీకాంత్, లాయర్ బాల నారాయణ, బాలు, గోవిందయ్య, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే యూత్ అసోసియేషన్ నాయకులు రాజు, శ్రీకాంత్, చంద్రబాబు, పేరయ్య, సతీష్, మండ శ్రీను, ఏకా ప్రభాకర్ తదితరులు హాజరై దళితుల సమస్యలపై చర్చించారు. కందుకూరు