
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ ఎస్సై ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు నిర్వహించి, కండలేరు గ్రామంలో జరుగుతున్న జూదా కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ దాడిలో 6 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి నగదు మరియు జూదా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే అక్రమ జూదా కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు తెలిపారు. ప్రజలు అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.