
తొలి శుభోదయం టంగుటూరు:-
ఘనతంత్ర వేడుకల్లో జిల్లాలో తొలిసారి గా టంగుటూరు తహసీల్దార్ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవిన్యూ స్థాల్ లో బ్రిటిష్ కాలం నాటి నుండి నేటి వరకు ఉన్న ల్యాండ్ రికార్డ్స్ ప్రదర్శన మరియు ఇటీవల పంపిణి చేసిన పాసు పుస్తకాలు లో ఉన్న సమాచారం గురించి ఆనందం వ్యక్తం చేసిన రైతుల అభిప్రాయం తో ఫిదా అయిన జిల్లా కలెక్టర్ రాజబాబు , JC గోపాలకృష్ణ , RDO ప్రసన్న లక్ష్మి రెవిన్యూ స్టాల్ కి జిల్లా స్థాయిలో రెండవ బహుమతి, మొందా తుపాన్ మరియు విరివిగా అందిస్తున్న రెవిన్యూ సర్వీసులకు గాను తహసీల్దార్ ఆంజనేయులు కి ఉత్తమ తహసీల్దార్ గా,ఉత్తమ సర్వేయర్ గా వల్లూరు సర్వేయర్ సురేష్ కి ప్రశంసా పత్రాలు అందుకున్నారు..
అలాగే జాతీయ ఓటరు దినోత్సవం రోజు మండలంలోని స్కూల్ పిల్లలకు జరిపిన క్రీడలలో గెలుపొందిన విద్యార్థులు తహసీల్దార్ గారి చేతుల మీదగా బహుమతులు అందజేయడం జరిగింది..ఈ విజయాల ఘనత తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి చెందుతుందని తహసీల్దార్ ఆంజనేయులు , డిప్యూటీ తహసీల్దార్ శ్రీనాధ్ తెలుపుతూ భవిష్యత్ లో మండల ప్రజలకు విశిష్ట సేవలు అందించి ప్రజల, అధికారుల హృదయాల్లో ఉందామని కోరారు..