
తొలి శుభోదయం కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి పటానికి దండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించారని, వారి త్యాగం సదా స్మరించుకోవాలని తెలియజేశారు. ఆనాడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా తెలుగు మాట్లాడే ప్రజలు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం కోసం ఎంతో కృషి చేసి, ఎన్నో పోరాటాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారని, ఆ స్ఫూర్తిని నేటితరం అందుకొని రాష్ట్రాలు అభివృద్ధికి పాటుపడాలని ఆయన విద్యార్థిని విద్యార్థులు కోరారు. కళాశాల చరిత్ర అధ్యాపకులు డా. డి. రామాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పటానికి దారి తీసిన చారిత్రాత్మక సంఘటన అన్నిటిని కూడా వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి అమరత్వాన్ని గుర్తుంచుకోవాలని, తద్వారా స్ఫూర్తిని పొంది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నడుం బిగించాలని కోరారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో స్కంధపురి సేవాసమితి చైర్మన్ పువ్వాడి మౌనిక పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్ వి శ్రీహరి, అధ్యాపకులు డాక్టర్ పి. రాజగోపాల్ బాబు, డాక్టర్ ఎన్. తిరుపతి స్వామి, డాక్టర్ కేవీ పద్మావతి, కే నరేష్ రాజా తదితరులు పాల్గొన్నారు.