
సీఎంఆర్ఎఫ్ సహాయాల్లో కందుకూరు టాప్
కూటమి ప్రభుత్వంలో 10 కోట్లకు పైగా విడుదల
ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామన్న ఎమ్మెల్యే ఇంటూరి
తొలి శుభోదయం కందుకూరు:-
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అత్యధికంగా కందుకూరు నియోజకవర్గానికి ఆర్థిక సహాయాలు మంజూరైనట్లు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు. కందుకూరు లోని టిడిపి కార్యాలయంలో 53 మందికి 45.27 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదల కోసం… దరఖాస్తు చేసిందే తడువుగా ఆర్థిక సహాయాలు అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు కందుకూరు నియోజకవర్గంలో 10 కోట్లకు పైగా నిధులు అందించామని తెలిపారు. అత్యధికంగా చెక్కులు మన నియోజకవర్గానికి రావడం అదృష్టమని, అందుకు ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. పేదలకు మేలు చేసేందుకు చంద్రబాబు నాయుడు ఎంతగా తపిస్తున్నారో ప్రజలు గమనించాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఆదరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
లబ్ధిదారుల వివరములు
ఉలవపాడు మండలంలో 20 మంది లబ్ధిదారులు 21.63 లక్షలు…
లింగసముద్రం మండలంలో 18 మంది లబ్ధిదారులు 9.30 లక్షలు..
గుడ్లూరు మండలంలో 15 మంది లబ్ధిదారులు 14.34 లక్షలు.
.మొత్తం 53 మంది లబ్ధిదారులు 45.27 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ మా ఆరోగ్య పరిస్థితి కొరకు ఇంత పెద్ద మొత్తంలో సీఎంఆర్ నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మరియు యువ నాయకులు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కి లబ్ధిదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, రాష్ట్ర APEWIDC కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు పార్టీ నాయకులు నార్నే రోశయ్య, పిడికిటి వెంకటేశ్వర్లు ఉప్పుటూరి శ్రీనివాసరావు, చదరవాడ కొండయ్య, షేక్ రూబీ, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, కూనం నరేంద్ర, నాదెళ్ల వెంకట రమణయ్య, అల్లం వెంకటేశ్వర్లు, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, షేక్ మున్నా, షేక్ సలాం, ముచ్చు శ్రీను, కొత్తూరి సుధాకర్ మురారి శెట్టి సుదీర్, మురారిశెట్టి శ్రీకాంత్, మరియు నియోజకవర్గంలోని అనుబంధ సంఘాల అధ్యక్షులు వార్డు, గ్రామ పార్టీ అధ్యక్షులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
