
తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:-
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన క్లస్టర్లు – కో క్లస్టర్లకు టిడిపి శిక్షణ తరగతులు కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “క్లస్టర్లు నిరంతరం యూనిట్, బూత్, గ్రామ మరియు మండల కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, వారి కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు.క్లస్టర్ ఇన్చార్జీలు ప్రతి నెలా పూర్తి కమిటీతో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమైన అంశాలపై క్యాడర్‌తో విస్తృతంగా చర్చించాలని సూచించారు.
పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత, క్రమశిక్షణ మరియు పరిణితి ప్రతి నాయకుడి ప్రవర్తనలో ప్రతిబింబించాలని పేర్కొన్నారు.
బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ఓటర్ల సంఖ్యను పెంచడం, న్యూట్రల్ ఓటర్లను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించుకోవడం విజయానికి కీలకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్లస్టర్ మరియు కో-క్లస్టర్ ఇన్చార్జీలు, పార్టీ క్యాడర్ పాల్గొన్నారు.