
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులలో మానసిక ఆరోగ్యం మరియు భావోద్వేగ శ్రేయస్సు అనే అంశం పై ఒంగోల్ హార్ట్ ఫుల్ నెస్ సంస్థ (Heartfulness institute) ఆధ్వర్యంలో ఒక అవగాహన సమావేశం జరిగింది.ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రవి కుమార్, మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మానసిక ఆరోగ్యమే పునాది అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళన, ఆర్థిక సమస్యలు, కుటుంబ పరిస్థితుల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ర్యాగింగ్ నియంత్రణ, కెరీర్ కౌన్సెలింగ్, అధ్యాపకులతో మెంటార్షిప్ వ్యవస్థ, జీవన నైపుణ్యాలపై సదస్సులు నిర్వహించి, ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఆనందంగా చదువుకొనే వాతావరణాన్ని కళాశాల కల్పించుచున్నదని తెలిపారు. హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్ మరియు రిటైర్డ్ లెక్చరర్, శ్రీ జీ వి శేషయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మంచి మానసిక ఆరోగ్యం సమతుల్యమైన మరియు సంతృప్తి జీవితానికి దోహదం చేస్తుందనీ, విద్యార్థులు సవాళ్లను స్వీకరించడానికి , సానుకూల సంబంధాలను కొనసాగించడానికి మరియు వారి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి వీలు కల్పిస్తుందని తెలియ జేశారు. విద్యార్థిని విద్యార్థులు కళాశాల సిబ్బంది ద్వారా అరగంటసేపు ధ్యానం చేయించారు. ప్రాక్టికల్ గా విద్యార్థులు మంచి విశ్రాంతిని మానసిక రిలాక్సేషన్ పొందారు.ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థులకు భవిష్యత్ తరానికి సమాజంలో ఎంతో మంచిది అని తెలియజేశారు. ప్రాక్టికల్ గా విద్యార్థులు మంచి విశ్రాంతిని మానసిక రిలాక్సేషన్ పొందారు.ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థులకు భవిష్యత్ తరానికి సమాజంలో ఎంతో మంచిది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వై కృష్ణ కుమార్ , కందుకూరు, ఈ కళాశాల పూర్వ విద్యార్థి హార్ట్ ఫుల్ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రత్న కరుణ కుమార్, ఎన్. ఎస్.ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ నరేష్ రాజా, కళాశాల లెక్చరర్లు డాక్టర్ మహబూబ్ బాషా,లూథర్, జయ ప్రశాంతి, హనుమంతరావు, రాఘవరావు, రామాంజనేయులు తదితర లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
