
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఫిజిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల వారి సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, ఎంట్రప్రెన్యూర్ షిప్, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించటమే లక్ష్యంగా నిర్వహించబడుతున్న డ్రోన్ పైలెట్ శిక్షణ కార్యక్రమం నాలుగవ రోజుకి చేరుకుంది. 9-2-2026న ప్రారంభమైన ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం రేపటి థియరీ పరీక్షతో ముగియనుంది. ఎస్. కె.పి .ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, ప్రధాన మంత్రి - ఉచ్చతర్ శిక్షా అభియాన్ (PM- USHA) ప్రోగ్రామ్ లో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై వారి సహకారంతో ఈ డ్రోన్ పైలెట్ శిక్షణా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజున ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించ బడుతున్నాయి. Rs.5 లక్షల విలువ చేసే డ్రోన్ ను కళాశాలకు అందజేస్తున్నారు.ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ సంస్థ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులకు డ్రోన్ ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా విద్యార్థినులు స్వయంగా డ్రోన్ ని ఆపరేట్ చేయడం, టేకాఫ్, లాండింగ్, ఎత్తు నియంత్రణ దిశ మార్చడం, జీపిఎస్ ఆధారిత నావిగేషన్ వంటి అంశాలలో తర్ఫీదు పొందారు. నిపుణుల పర్యవేక్షణలో ప్రాక్టికల్ సెషన్స్ నిర్వహించారు. విద్యార్థినులు ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఈ ట్రైనింగ్ లో పాల్గొన్నారు. డ్రోన్ ఆపరేట్ చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందిందని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవి కుమార్ మాట్లాడుతూ ఇటువంటి స్కిల్ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానం అందిస్తాయని, స్వయం ఉపాధి అవకాశాలకు మార్గం చూపుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎన్వి శ్రీహరి, వి. కృష్ణశర్మ, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ జె . హనుమంతరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర ఏడుకొండలు, ఐక్యూ ఏసీ కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.రాజగోపాల్ బాబు ఇతర విభాగాల అధిపతులు మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
