
తొలి శుభోదయం:-
టి. ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ స్వయం ప్రతిపత్తి కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో మిగిలి పోయిన సీట్లకు గాను మూడవ విడత డిగ్రీ ప్రవేశాలు ప్రారంభమైనవని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ తెలియజేశారు. దీనికి సంబంధిన షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది కనుక ఈ నెల 25 ,26 తేదీల్లో కళాశాలలో రిజిస్ట్రేషన్, 30వ తేదీ వెబ్ ఐచ్చికాల మార్పు, నవంబర్ 1న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబరు 4 లోపు కళాశాలలో చేరవలసి ఉంటుందని, డిగ్రీలో చేరదలచిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సరిఫికెట్లతో కళాశాలకు విచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ తెలియజేశారు.