
తొలి శుభోదయం ప్రకాశం:-
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించబడేలా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలను మోహరించి, నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. అభ్యర్థులు భయం లేకుండా పరీక్షలు రాసేందుకు అనుకూల వాతావరణం కల్పిస్తూ, శాంతి–భద్రతలను సమర్థవంతంగా నిర్వహించారు.