
తొలి శుభోదయం ప్రకాశం:-
"ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్" (TET) పరీక్షలు నేపథ్యంలో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, అంతరాయం లేకుండా జరగేందుకు ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ కొనసాగించారు.