
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన మైనరలకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మైనర్ చేత డ్రైవింగ్ చేయించడం ద్వారా కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు, రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా సంబంధిత వాహనాలపై ఈ-చలాన్ విధించి, జరిమానాలు నమోదు చేశారు.తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణాలను కాపాడే ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని సిఐ సూచించారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలందరినీ ట్రాఫిక్ నియమాలను సమగ్రంగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.