
మార్కాపురం జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ. యం విజయ సునీత…
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
నవ భారత రాజ్యాంగ నిర్మాత,ప్రపంచ జ్ఞాని,న్యాయ కోవిదుడు,భారతదేశ దిక్సూచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ యం విజయ సునీత అన్నారు.మంగళవారం న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి ని పురస్కరించుకొని అఖిల భారత మాల సంఘాల జేఏసీ మార్కాపురం జిల్లా అధ్యక్షులు నందం శేఖర్ ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం అఖిల భారత మాల సంఘాల జేఏసీ మార్కాపురం జిల్లా అధ్యక్షులు నందం శేఖర్,ప్రధాన కార్యదర్శి బిల్లా ఇశ్రాయేలు,లింగాల రామయ్య,డొక్కా రవి,అంబడిపూడి చిన్నరామయ్య,కూకట్లపల్లి అప్పన్న, గొట్టముక్కల శ్రీనివాసులు,లింగాల శ్రీనివాసులు,బల్లాని రమణ,నందం దానమయ్య, ప్రసాదు,భాస్కర్,మల్లికార్జున చిలకపాటి నాగచైతన్య పాల్గొన్నారు..