
తొలి శుభోదయం న్యూస్ విజయవాడ:-
మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా విజయవాడ బాలోత్సవ భవన్ నందు విశ్వ సాహితీ కళావేదిక చైర్మన్ కొల్లి రమావతి గారి ఆధ్వర్యంలో 32 డిపార్ట్మెంట్స్ నుండి విశిష్ట సేవలంఅందించిన మహిళా మూర్తులను ఎంపిక చేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా మాచర్లకు చెందిన డాక్టర్ సాంబేలు శాంతి బాయి ని ఆహ్వానం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మూడుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గజల్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ నాటకారంగా సంస్థ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ,ఐఏఎస్ ఇంతియాస్ విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, కవులు పూర్ణ చందు, గొళ్ళి నారాయణరావు,రంగశెట్టి రమేష్ తదితరుల చేతుల మీదుగా ఆమెను సత్కరించి, శాంతి బాయి వరల్డ్ వెల్ బీయింగ్ ఫౌండేషన్ ద్వారా విద్యా,సాహిత్య ,పర్యావరణ, సేవా ,కళా రంగాలలో చేస్తున్నటువంటి అవిరళ కృషికి గాను ఘనంగా సత్కరించి అభినందించారు