
తొలి శుభోదయం సింగరాయకొండ:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ – డివిజన్ స్థాయి పోటీలు సోమవారం ఒంగోలు పి.వి.ఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో జరిగిన లీగ్ దశ కీలకమైన మ్యాచ్లో సింగరాయకొండ మండల ఉపాధ్యాయుల క్రికెట్ టీం, టంగుటూరు మండల టీంపై అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది.సింగరాయకొండ మండల టీం సభ్యులు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమన్వయంతో ఆడుతూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా జట్టు సభ్యుల క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ విజయంతో సింగరాయకొండ మండల టీం తదుపరి దశకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు, సహచర ఉపాధ్యాయులు జట్టు సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఉపాధ్యాయుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.
