
తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు పట్టణంలో 5.43 కోట్ల రూపాయలతో జరుగుతున్న డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఇతర అభివృద్ధి పనులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. టిడిపి నాయకులు, మున్సిపల్ అధికారులతో కలిసి పామూరు రోడ్డు జంక్షన్ వద్ద పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పామూరురోడ్డు జంక్షన్ లో ఏర్పాటు చేస్తున్న సర్కిల్ పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అక్కడి నుంచి పామూరు బస్టాండ్ వైపు నిర్మించిన డివైడర్, కరెంటు స్తంభాలు, డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కలను దగ్గరగా గమనించారు. పనులు త్వర త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పామూరు రోడ్డు జంక్షన్ వరకు పనులు పూర్తికాగా, డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి దివి కొండయ్య చౌదరి విగ్రహం వరకు పనులను సంక్రాంతిలోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ గణపతి, ఏఈ బాలాజీ, పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల టిడిపి అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి, బెజవాడ ప్రసాద్, కాంట్రాక్టర్ గొంది నర్సింగరావు, షేక్ మున్న, తల్లపనేని రవీంద్ర, మంచిరాజు మురళి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
