
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి వై బ్రాండ్స్ కలాం ఆర్గనైజర్ విజయ్ కాలం ను ఆయన అభినందించారు. తిరుపతి నుండి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర ఏప్రిల్ 22న విశాఖపట్నంలో ముగుస్తుందని విజయ్ కలం తెలిపినారు.
మాదకద్రవ్యాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు బాధ్యతని సాంత్వనా డైరెక్టర్ జయకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వీరికి సింగరాయకొండలో ఘన స్వాగతం పలికారు. వారికి అన్ని వసతులు ఏర్పాటు చేసి న సింగరాయకొండ సిఐ కి వారు ధన్యవాదాలు తెలిపారు. తదుపరి రైజ్ కాలేజీలో భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
