
తొలి శుభోదయం:-
ఉలవపాడు తుఫాను ప్రభావిత ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను సందర్శించిన వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలి రెడ్డి. మన్నేటికోట తిరుపతమ్మ గుంట ఎస్సీ కాలనీవాసులను ఉంచిన పునరావాస కేంద్రాన్ని, కరేడు తుఫాను ప్రభావిత ప్రాంతవాసులను మించిన బాలకోటయ్య సంఘం పునరావాస కేంద్రంలో ఉన్న వారిని పలకరించి, ఆహార పదార్థాలు పంపిణీ చేయడం జరిగింది. వారికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి కొక్కిలగడ్డ కృష్ణారావు, పీతాా రామకృష్ణ, నల్లపరెడ్డి సుధాకర్ రెడ్డి, రామాల కృష్ణారెడ్డి, కలికి శివారెడ్డి , మహిదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..